వయ్యారాలు ఒలకబోస్తూ అషురెడ్డి!
on Jul 7, 2023
అషురెడ్డి.. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడీయాలో అప్డేట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది.అషు రెడ్డి.. ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. అందాల ఆరబోతకి పెట్టింది పేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కనిపించే అషు గురించి చెప్పనక్కరలేదు. యూట్యూబ్ ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ తో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనే చెప్పాలి.
బిగ్ బాస్ షో తర్వాత అషు.. వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటుంది. అషు రెడ్డి, పటాస్ హరితో కలిసి కామెడీ స్టార్స్ షోలో చేసింది. కాగా ఆ షోలో హరి ఛాతిమీద అషురెడ్డి టాటూ చూసి అందరూ అవక్కాయ్యారు. దాంతో వాళ్ళద్దరు లవ్ లో ఉన్నట్లుగా అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. అయితే తాజాగా ముగిసిన బిబి జోడిలో మెహబూబ్ తో కలిసి జతకట్టిన అషు.. డాన్స్ చెయ్యకుండానే తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలని షేర్ చేయగా అప్పట్లో అవి వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
కొన్ని వారాల క్రితం 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పిన అషురెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కోసం ఒక పాట పాడి, అతను తన గుండెల్లో ఉన్నాడని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా విదేశాలకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది అషురెడ్డి. కాగా రోజు రోజుకి గ్లామర్ డోస్ ని పెంచేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ ని షేర్ చేసింది. 'వాట్స్ విత్ ది థ్రెడ్స్ నౌ' అనే టైటిల్ తో బ్లాక్ డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అషురెడ్డి. కాగా ఇవి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.
Also Read